Pushpa 2: టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియాలో రానున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ‘పుష్ప: 2 ది రూల్’ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప ది రైజ్’. 2021లో విడుదలైన ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయింది. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడంతో… ఈ సినిమా పాన్ ఇండియా సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్ గా తెరరకెక్కిస్తున్న ‘పుష్ప: 2 ది రూల్(Pushpa 2)’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Pushpa 2 Release Updates
అయితే ‘పుష్ప: 2 ది రూల్’ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ తోపాటు, పాటలు తెరకెక్కించాల్సి ఉంది. వీటికి సమయం పట్టే సూచనలు కనిపించడంతో సినిమాని వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ‘పుష్ప: ది రైజ్’ కూడా డిసెంబరులోనే విడుదలైంది.
Also Read : Seetha Kalyana Vaibhogame: ‘సీతా కళ్యాణ వైభోగమే’ టీజర్, ట్రైలర్ ను తిలకించిన సీఎం రేవంత్ !