Pushpa-2 Movie : పుష్ప -2 మూవీ అప్ డేట్

మార్చి 2న రిలీజ్ కు ఛాన్స్

Pushpa-2 Movie : క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప ది రైజ్ దుమ్ము రేపింది. రికార్డుల మోత మోగించింది. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా , పాన్ ఇండియా హీరోగా పేర్కొనేలా చేసింది. అద్భుత‌మైన టేకింగ్ , ఆక‌ట్టుకునే డైలాగులు , మెస్మ‌రైజ్ చేసే పోరాట స‌న్నివేశాలు..అంత‌కు మించి ఊపునిచ్చిన సాంగ్స్ ఇలా అన్నీ సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచేలా చేశాయి.

Pushpa-2 Movie The People Are Waiting

ఆశించిన దాని కంటే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టింది పుష్ప ది రైజ్. తాజాగా జాతీయ స్థాయిలో పుష్ప చిత్రంలో అద్భుత‌మైన నట‌న ప్ర‌ద‌ర్శించినందుకు గాను ఉత్త‌మ హీరో అవార్డు ద‌క్కింది బ‌న్నీకి. ఆయ‌న ఇంట ఆనందం వెల్లి విరిసింది.

ఇదే స‌మ‌యంలో పుష్ప భారీ స‌క్సెస్ తో నిర్మాత‌లు పుష్ప -2(Pushpa-2) ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఎక్క‌డా ప్ర‌చారం లేకుండా కామ్ గా షూటింగ్ కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు త్వ‌ర‌లోనే పుష్ప‌-2 మూవీకి సంబంధించి భారీ అప్ డేట్ రాబోతోంద‌ని స‌మాచారం. ఈ మేర‌కు వ‌చ్చే ఏడాది 2024 మార్చి 2న అల్లు అర్జున్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టాక్. దీంతో పుష్ప -1 తో రికార్డుల మోత మోగించిన బ‌న్నీ రాబోయే సీక్వెల్ సినిమాలో ఇంకెలా న‌టించాడనే దానిపై ఫ్యాన్స్ ఉత్కంఠ‌తో ఉన్నారు.

Also Read : Jailer Record : త‌మిళ‌నాట జైల‌ర్ రికార్డుల మోత‌

pushpa-2 allu arjun sukumar movie release date fix
Comments (0)
Add Comment