Pushpa 2 : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప-2(Pushpa 2) రికార్డుల మోత మోగిస్తోంది. 2024 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. సినీ రంగాన్ని విస్తు పోయేలా చేసింది. ఒకటా రెండా ఏకంగా రూ. 2,000 కోట్లకు పైగా వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా.
Pushpa 2 OTT Updates
డైలాగులతో పాటు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పుష్ప చిత్రం బాక్సులు బద్దలు కొట్టేలా చేసింది. ఇదిలా ఉండగా హిందీలో వచ్చిన దంగల్ మూవీ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.
భారీ ధరకు అమ్ముడు పోయింది ఓటీటీలో. దీనిని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఆశించిన దానికంటే అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజై ఇంకా కలెక్షన్లు రాబడుతోంది. మూవీ మేకర్స్ పుష్ప-2కు సంబంధించి రీ లోడెడ్ వెర్షన్ కూడా జత చేసి విడుదల చేశారు.
తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల గుండెలను మీటుతోంది. అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై సందడి చేస్తోంది పుష్ప-2 . ఎంతైనా బన్నీనా మజాకా ఆంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Glamorous Rashmika : డేటింగ్ జోరు రష్మిక మందన్నహోరు