Pushpa 2 : ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఎవరూ ఊహించని రీతిలో తను నటించిన పుష్ప-2 మూవీతో రికార్డుల మోత మోగిస్తున్నాడు. వసూళ్ల వేట కొనసాగిస్తూ అందరినీ విస్తు పోయేలా చేస్తున్నాడు. ఒకటా రెండా ఏకంగా చెప్పి మరీ వసూళ్లను సాధించడం మామూలు విషయం కాదు. ఓ వైపు ఐటీ దాడులు కొనసాగుతున్నా మరో వైపు ఫ్యాన్స్ మాత్రం సినిమాను విడిచి పెట్టడం లేదు.
Pushpa 2 Record Collections
ఊచ కోత కోస్తూ ముందుకు వెళుతోంది బన్నీ, రష్మిక మందన్నా, శ్రీలీల నటించిన పుష్ప-2(Pushpa 2) సీక్వెల్ మూవీ. పుష్ప దుమ్ము రేపితే ..దానిని అధిగమిస్తూ వసూళ్లు సాగిస్తోంది. తాజా సినీ వర్గాల అంచనా ప్రకారం పుష్ప-2 వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 2,200 కోట్లు సాధించిందని సమాచారం.
ఇదిలా ఉండగా డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2 మూవీ గత ఏడాది డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ చేశారు. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్లింది ఈ మూవీ.
దమ్మున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, మ్యూజిక్ పుష్ప-2 కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక శ్రీలీల డ్యాన్సులు, రష్మిక మందన్నా సోయగాలు, బన్నీ అద్భుత నటన సినిమాకు అదనపు హంగులు చేకూర్చాయి.
Also Read : SS Thaman Dynamic Update : అఖండ-2 మాములుగా ఉండదు