Pushpa 2 : ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప-2’. ది రూల్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ తో కలిసి నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు రెట్టింపు చేశాయి. ఈక్రమంలోనే టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. రోజురోజు కు అంచనాలు పెంచుకుంటున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Pushpa 2 Movie Updates
అయితే.. గత కొంతకాలంగా పుష్ప2(Pushpa 2) సినిమా విషయంలో జరుగుతున్న, వస్తున్న వార్తలకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఫహాద్‌తో ఏదో ఇష్యూ ఉందని, అల్లు అర్జున్ గడ్డం తీసివేసి ట్రిప్‌కు వెళ్లాడంటూ ఒకటికి రెండు వార్తలు సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరిగాయి. ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పెడుతూ మూవీ టీం సాలీడ్ ఆప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుందని, సినిమా పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారని, సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా ఉండబోతున్నాయని, రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని అంటున్నారు. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : Sardar 2 Movie : హీరో కార్తీక్ సర్దార్ 2 సినిమా కోసం క్యూ లో ముగ్గురు భామలు