Popular Singer Gaddar Awards :గ‌ద్ద‌ర్ అవార్డు రేసులో పుష్ప‌2 ..?

నంది అవార్డుల స్థానంలో

Gaddar Awards : ప్ర‌తి ఏటా ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ఈసారి రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ మార్చేసింది. వీటికి బ‌దులు ప్ర‌జా యుద్ద నౌక దివంగ‌త గ‌ద్ద‌ర్ పేరు మీద ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌కు చెందిన న‌టీన‌టులు, నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు. మ‌రికొంద‌రు మ‌ద్ద‌తు ఇచ్చారు. దీనిపై రెండు వ‌ర్గాలుగా విడి పోయారు కూడా. చివ‌ర‌కు ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

Gaddar Awards-Pushpa 2

త్వ‌ర‌లోనే అవార్డుల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు వెల్ల‌డించారు. అవార్డుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని, అది జాతీయ స్థాయి కార్యక్రమాలతో సమానంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను కోరినట్లు సమాచారం. ఈ అవార్డులను కేవలం చలనచిత్రాలకు మాత్రమే కాకుండా, పిల్లల చిత్రాలకు, తెలుగు పుస్తకాలకు కూడా అందజేయనున్నట్లు సమాచారం.
ప్రఖ్యాత తెలుగు సినిమా కళాకారులను స‌న్మానించ‌నున్నారు.

అయితే సినిమా రిలీజ్ సంద‌ర్బంగా చోటు చేసుకున్న పుష్ప‌2(Pushpa 2) ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో ఇందులో న‌టించిన అల్లు అర్జున్ ఉత్త‌మ నటుడి కేట‌గిరీలో అవార్డు అందుకుంటారా అన్న‌ది ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధించింది. ఇందులో అసామ‌న న‌ట‌నా ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించారు బ‌న్నీ. మొత్తంగా ఉత్త‌మ న‌టుడి రేసులో అల్లు ఉన్నాడ‌నేది వాస్త‌వం.

Also Read : Hero Allu Arjun-Megastar :అల్లు అర్జున్ మూవీలో మెగాస్టార్..?

Gaddar AwardsPushpa 2UpdatesViral
Comments (0)
Add Comment