Pushpa 2 : ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందారు. ఈ ఘటనలో అర్జున్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బిఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కానీ ప్రాణ నష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది.
Pushpa 2 Police Case…
పుష్ప-2(Pushpa 2) విడుదల సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ విజిట్ వస్తున్నారని తెలియడంలో అభిమానులు తండోపతండాలు సంధ్య థియేటర్‌కు చేరుకున్నారు. దాంతో అక్కడ డీజే ఏర్పాటు చేయడంతో యువత కోలాహలం చేశారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని స్ధితికి పరిస్థితికి చేరుకుంది. దాని కోసం పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం తో జనాలు పరుగులు తీశారు. తొక్కిసలాట జరగడంతో కాళ్ల కింద పడి ఓ మహిళ, ఓ బాలుడు నలిగిపోయారు. రేవతి అనే మహిళ మరణించారు. అయితే హీరో వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు.
Also Read : Minister Komatireddy : ఇక మీదట నో బెన్ ఫిట్ షోస్ అంటున్న తెలంగాణ మంత్రి