Purushothamudu: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు(Purushothamudu)’. హాసినీ సుధీర్ హీరోయిన్. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. అదే సమయంలో రాజ్ తరుణ్, తన మాజీ ప్రియురాలు లావణ్యతో జరిగిన రచ్చ కూడా ఈ సినిమాపై ప్రభావం చూపింది. లావణ్య చేసిన రచ్చ ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చినప్పటికీ… సినిమా థియేటర్లలోనికి వచ్చిన తరువాత ఈ పబ్లిసిటీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’ లో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ పంచుకుంది.
Purushothamudu – ‘పురుషోత్తముడు’ సినిమా కథేమిటంటే ?
రచిత్ రామ్ (రాజ్‌తరుణ్) పుట్టుకతోనే కోటీశ్వరుడు. భారత్‌లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పీఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్య రామ్ (మురళీ శర్మ) తనయుడు. లండన్‌లో చదువు పూర్తి చేసుకుని దేశానికి తిరిగొస్తాడు. అతను వచ్చీ రాగానే పీఆర్ గ్రూప్స్ కొత్త సీఈవోగా నియమించాలని ఆదిత్య రామ్ నిర్ణయించుకుంటాడు. కానీ, దానికి రచిత్ పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ బైలా ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి ఎవరైనా సరే 100 రోజుల పాటు ఓ సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి చేరుకుంటాడు. మరి, అక్కడికి వెళ్లాక రచిత్ రామ్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతడు.. ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? రచిత్‌కు.. అమ్ము (హాసినీ సుధీర్)కు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది? అన్నదే మిగిలిన కథ.
Also Read : Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో సందడి చేయనున్న ఓ హీరోయిన్, ఓ డ్యాన్సర్ !