Puri Jagannath : వరుసగా తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా ఎక్కడా తన క్రేజ్ తగ్గలేదని నిరూపించాడు డైనమిక్ డైరెక్టర్, ఆర్జీవీ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పూరీ జగన్నాథ్(Puri Jagannath). తను రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ . ఆ తర్వాత దీనిని సీక్వెల్ గా తీశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో కలిసి లైగర్ తీశాడు. ఆశించిన మేర నడవలేదు. అయినా ఎక్కడా తగ్గడం లేదు. కథలు రాస్తూ, తయారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు పూరీ జగన్నాథ్. తాజాగా తన నుంచి సంచలన ప్రకటన త్వరలోనే రానుంది.
Puri Jagannath Movie with Vijay Sethupathi
తను తమిళ సినీ రంగంలో టాప్ నటుడిగా కొనసాగుతున్న విజయ్ సేతుపతితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని వినికిడి. దానికి పేరు కూడా పెట్టినట్లు టాక్. ఇక సినిమాలకు సంబంధించి టైటిల్స్ ను పెట్టడం తనకు తనే సాటి. పోకిరి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే..ఇలా చాలా ఉన్నాయి. తను తీయబోయే మూవీకి బెగ్గర్ అని టైటిల్ ఫిక్స్ చేశాడు. మక్కల్ సెల్వన్ తో కలిసి ఓ ఉత్దేజ కరమైన చిత్రాన్ని చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు విజయ్ సేతుపతి. ఇద్దరూ డిఫరెంట్ గా ఆలోచించే వారే కావడం విశేషం. అంతే కాకుండా టైటిల్ కూడా విలక్షణంగా, ఆకట్టుకునేలా ఉండడంతో పూరీ ఫ్యాన్స్ , ప్రత్యేకించి సేతుపతి ఫ్యాన్స్ తెగ సంతోషానికి లోనవుతున్నారు. టేకింగ్, మేకింగ్ లో స్పాంటేయిన్ గా కదిలే దర్శకుడు కావడంతో రాబోయే సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Court Sensational Collection :ఓవర్సీస్ లోనూ కోర్ట్ కలెక్షన్స్ అదుర్స్