Puri Jagannath Shocking Comment :పూరీ గోలిమార్ సీక్వెల్ కు రెడీ

మ‌రోసారి గోపిచంద్ కాంబో

Puri Jagannath : మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. త‌ను గోపిచంద్ , ప్రియ‌మ‌ణితో తీసిన గోలిమార్ బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఈ చిత్రం 2010లో విడుద‌లైంది. ఆశించిన దానికంటే ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందింది. గోపిచంద్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. చాలా కాలం గ్యాప్ త‌ర్వాత గోలిమార్ పై ఫోక‌స్ పెట్టాడు పూరీ జ‌గ‌న్నాథ్(Puri Jagannath). ఇప్ప‌టికే స్క్రిప్ట్ కూడా సిద్దం చేశాడ‌ని ప్ర‌చారం .

Puri Jagannath Comment

రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంక‌ర్ బంప‌ర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా తీసిన డ‌బుల్ ఇస్మార్ట్ బోల్తా ప‌డింది. రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ చిత్రం తీశాడు. ఇది తేలి పోయింది. దీంతో పూరీ జ‌గ‌న్నాథ్ కొంత నిరాశ‌కు లోన‌య్యాడు. అయినా మొక్క‌వోని ప‌ట్టుద‌ల‌తో తిరిగి ఫీనిక్స్ ప‌క్షి లాగా మ‌రో సినిమాను తెర‌కెక్కించేందుకు రెడీ అయ్యాడు పూరీ జ‌గ‌న్నాథ్.

ఇప్ప‌టికే క‌థ కూడా గోపిచంద్ కు వినిపించాడని టాక్. దీనికి త‌ను కూడా ఓకే చెప్పాడ‌ని, పాత నిర్మాత‌తోనే గోలిమార్ మూవీని సీక్వెల్ తీసేందుకు అన్నీ సిద్దం చేసుకున్న‌ట్లు టాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టేకింగ్, మేకింగ్ లో డిఫ‌రెంట్ గా ఉండే పూరీ జ‌గ‌న్నాథ్ నుంచి వ‌చ్చే సినిమా అంటేనే జ‌నంలో మ‌రింత ఆస‌క్తిని రేప‌డం ఖాయం.

బుల్లెట్ల లాంటి డైలాగులతో హీరోల‌కు ప్రాధాన్య‌త ఉండేలా చూడ‌డంలో ఎక్కువ‌గా ఫోక‌స్ పెడతాడు పూరీ. మాఫియా నేప‌థ్యంగా వ‌చ్చిన గోలిమార్ సూప‌ర్ స‌క్సెస్ గా నిలిచింది.

Also Read : Mahesh Babu Reject :డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ ప్రిన్స్ రిజెక్ట్

CinemaCommentsGopichandpuri jagannadhViral
Comments (0)
Add Comment