Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నటి ఛార్మి నిర్మాతగా 2019లో విడుదల అయిన ఈ చిత్రం అటు పూరి, ఇటు రామ్‌కు ఓ డిఫరెంట్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. దీనితో దర్శకుడు పూరి జగన్నాథ్… ఈ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ లో సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీనితో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మే 15వ తేదీన హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Puri Jagannadh:
ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్’ కు సంబంధించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. మే 15వ తేదీన ఈ మూవీకి సంబంధించి 85 సెకన్ల వీడియోను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ‘డబుల్ ఇస్మార్ట్ రీక్యాప్’ అంటూ స్పెషల్ వీడియోను పూరి జగన్నాథ్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్స్‌లో అభిమానులు చేసిన సందడితో కూడిన సన్నివేశాలను ఇందులో పొందుపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
Also Read : Dhanush: నడిగర్ సంఘం భవన నిర్మాణానికి రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్ !