Pujita Ponnada- Stunning :పూజిత పొన్నాడ నెట్టింట్లో వైర‌ల్

టాటూతో న‌టి హ‌ల్ చ‌ల్

Pujita Ponnada : డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ తీసిన రంగ‌స్థ‌లం, నాగ్ అశ్విన్ తీసిన క‌ల్కి మూవీల‌లో త‌ళుక్కున మెరిసింది తెలుగమ్మాయి న‌టి పూజిత పొన్నాడ‌. ఈ రెండు మూవీస్ స‌క్సెస్ అయ్యాయి. ఇందులో న‌టించిన పూజిత‌(Pujita Ponnada)కు మంచి పేరొచ్చింది. తాజాగా టాటూతో ద‌ర్శ‌నం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇవి హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వైర‌ల్ గా మారాయి.

Pujita Ponnada Stunning Looks

త‌న స్వ‌స్థలం ఏపీలోని విశాఖ‌. బీటెక్ చ‌దివింది. ముందు మోడ‌ల్ గా ప‌ని చేసింది. ఆ త‌ర్వాత సినీ రంగంలోకి ప్ర‌వేశించింది. తండ్రి ఉద్యోగి రీత్యా చెన్నై, డిల్లీ న‌గ‌రాల్లో పెరిగింది. చ‌దువు పూర్త‌య్యాక ప్ర‌ముఖ దిగ్గ‌జ ఐటీ కంపెనీ టీసీఎస్ లో జాబ్ కూడా చేసింది. అందం, అభిన‌యం బాగుండ‌డంతో ద‌ర్శ‌కుల క‌ళ్లు పూజిత పొన్నాడ‌పై ప‌డ్డాయి.

2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలింలో న‌టించింది. 2016లో వ‌చ్చిన తుంట‌రి చిత్రంతో అరంగేట్రం చేసింది. 2017లో ద‌ర్శ‌కుడు, 2018లో రంగ‌స్థ‌లం, రాజు గాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 2019లో 7 భాను (ద్విభాషా చిత్రం) , క‌ల్కి, వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి, 2020లో ర‌న్ శృతి (ఆహా మూవీ), మిస్ ఇండియా నెట్ ఫ్లిక్స్ సినిమాలో న‌టించింది. 2021లో మ‌నిషి, 2022లో క‌థ కంచికి మ‌నం ఇంటికి, ఓదెల రైల్వే స్టేష‌న్, ఆకాశ వీధుల్లో, 2023లో రావ‌ణాసుర‌లో న‌టించింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రి హ‌ర వీర మ‌ల్లు మూవీలో ఓ సాంగ్ లో ప్ర‌త్యేకంగా క‌నిపించ‌నుంది పూజిత పొన్నాడ‌.

Also Read : Ramesh Babu Shocking : ఆ హీరోల వ‌ల్ల రూ. 100 కోట్లు న‌ష్టపోయా

Photo ShootPujitha PonnadaViral
Comments (0)
Add Comment