Prudhvi Raj Shocking Comment :పోసాని అరెస్ట్ పృథ్వీ రాజ్ కామెంట్స్

నోటి దూల‌కు త‌గిన శాస్తి జ‌రిగింది

Prudhvi Raj : హైద‌రాబాద్ – థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌గ‌న్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా ఇష్టం వ‌చ్చిన‌ట్లు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు పోసాని కృష్ణ ముర‌ళి. త‌న‌పై ప‌లు చోట్ల కేసులు న‌మోద‌య్యాయి. ఊహించ‌ని రీతిలో వైసీపీ 11 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. అధికారానికి దూర‌మైంది.

Prudhvi Raj Shocking Comments on Posani Arrest

వైసీపీ వ‌ప‌ర్ లోకి రావ‌డానికి పృథ్వీ రాజ్(Prudhvi Raj) కీల‌క పాత్ర పోషించాడు. త‌న‌ను ఎస్వీబీసీ చైర్మ‌న్ గా ఛాన్స్ ఇచ్చారు జ‌గ‌న్. తాను లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ రెడ్డికి గుడ్ బై చెప్పాడు. ఆ త‌ర్వాత కూట‌మికి ద‌గ్గ‌ర‌య్యాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నాగ‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచాడు.

ఈ మ‌ధ్య లైలా మూవీ ప్రీ ఈవెంట్ లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. 11 గొర్రెలు మాత్ర‌మే మిగిలాయంటూ కామెంట్స్ చేశాడు. దీంతో వైసీపీ నేత‌లు, శ్రేణులు త‌న‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఆ త‌ర్వాత సారీ చెప్పాడు పృథ్వీ రాజ్. మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. ఇక నుంచి సామాజిక వేదికల ద్వారా త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటాన‌ని తెలిపాడు. ఎక్స్ వేదిక‌గా దుమ్ము రేపుతున్నాడు.

Also Read : Popular Actor Shiva Rajkumar :కోలుకున్న శివ రాజ్ కుమార్ మూవీస్ పై ఫోక‌స్

CommentsPosani Krishna MuraliPrudhvi RajViral
Comments (0)
Add Comment