Prudhvi Raj Shocking Comment :గొంతు విప్పుతా తాడో పేడో తేల్చుకుంటా

క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్ కామెంట్స్

Prudhvi Raj : 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఎక్స్ వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉంటూ వ‌చ్చాన‌ని, కానీ ఇప్ప‌టి నుంచి..ఇక నుంచి స్వేచ్ఛ‌గా త‌న గొంతు విప్పుతాన‌ని ప్ర‌క‌టించారు.

Prudhvi Raj Shocking Comments

తాను త‌నలోని భావాల‌ను స్టేజ్ పైన ప్ర‌క‌టిస్తుంటే కొంద‌రు త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయ‌ని బాధ ప‌డుతున్నార‌ని అందుకే తాను సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాన‌ని పేర్కొన్నారు. తాను నాకు సంబంధించినంత వ‌ర‌కు నాలో చెల‌రేగా భావాల‌ను, అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటాన‌ని, త‌న అభిప్రాయాల‌ను క‌చ్చితంగా వ్య‌క్తం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న హై నేను మీ 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ రాజ్(Prudhvi Raj). నేను అధికారికంగా ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా మ‌రింత ఉత్సాహంగా మీ ముందుకు వ‌స్తున్నాన‌ని తెలిపారు. అంతే కాదు ఇక నుంచి కొత్త‌గా, స‌రికొత్త‌గా నా అభిప్రాయాల‌ను నిర్మోహ మాటంగా తెలియ చేస్తాన‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా తాను ఇటీవ‌ల పెద్ద ఎత్తున ట్రోల్ కు గుర‌య్యాడు. విశ్వ‌క్ సేన్ న‌టించిన లైలా మూవీ ఈవెంట్ సంద‌ర్భంగా 11 గొర్రెలు అంటూ కామెంట్ చేశాడు. దీంతో త‌న‌ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. చివ‌ర‌కు బీపీ పెరిగి ఆస్ప‌త్రి పాల‌య్యాడు. ఇప్పుడు కోలుకుని త‌న స‌త్తా ఏమిటో చూపిస్తానంటున్నాడు పృథ్వీ రాజ్.

Also Read : Ranu Mumbai Ki Ranu Sensational :రాను ముంబైకి రాను నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

CommentsPrudhvi RajShockingViral
Comments (0)
Add Comment