Beauty Vaishnavi Chaitanya :నిర్మాత కామెంట్స్ బేబీ సీరియ‌స్

ప‌రోక్షంగా త‌న‌ను ఉద్దేశించి చేసిన‌వే

Vaishnavi Chaitanya : గ‌తంలో బాలీవుడ్ లో ఎక్కువ‌గా న‌టీ న‌టులు ఎప్పుడూ వార్త‌ల్లో ఉండేందుకు ఇష్ట ప‌డే వారు. కానీ ఈ మ‌ధ్య‌న ఆ జాడ్యం టాలీవుడ్ కు సోకింది. ఏకంగా త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌చారంపై ఫోక‌స్ పెడుతున్నారు. ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.

Vaishnavi Chaitanya Comments

ఇందుకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా హీరోలు నోరు పారేసుకుంటున్నారు. ఎంద‌రికో ఆద‌ర్శ ప్రాయంగా ఉండాల్సిన మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మ‌ధ్య‌నే ఆడ‌పిల్ల‌ల‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న ఇంట్లో అంద‌రూ మ‌హిళ‌లే ఉన్నార‌ని, త‌న‌కంటూ ఓ వార‌సుడు కావాల‌ని, అది చెర్రీ తీరుస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గుర‌య్యారు. అంతే కాదు సెక్సీయిస్ట్ చిరంజీవి అంటూ నేష‌న‌ల్ మీడియా ఏకి పారేసింది. ఆ త‌ర్వాత మెగాస్టార్ తో క‌లిసి లైలా మూవీ ఈవెంట్ లో పాల్గొన్నాడు క‌మెడియ‌న్ 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ డైలాగ్ నే త‌న ఇంటి పేరుగా మార్చుకున్న పృథ్వీ రాజ్. ఏకంగా వైసీపీని ఉద్దేశించి చేసిన 11 సంఖ్య వివాదాస్ప‌దంగా మారింది.

తాజాగా మూవీస్ కు సంబంధించి కాంట్ర‌వ‌ర్శియ‌ల్ కామెంట్స్ చేశారు నిర్మాత శ్రీ‌నివాస కుమార్. త‌ను బేబీ మూవీ ఫేమ్ వైష్ణ‌వి చైత‌న్య గురించి చుల‌క‌న చేస్తూ వ్యాఖ్యానించారు. త‌న‌ను ఉద్దేశించి కాక పోయినా స‌ద‌రు చిత్రం గురించి ప్ర‌స్తావించ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై సీరియ‌స్ అయ్యింది న‌టి.

Also Read : Vaishnavi Chaitanya React నిర్మాత కామెంట్స్ బేబీ సీరియ‌స్

CommentsProducer SKNVaishnavi ChaitanyaViral
Comments (0)
Add Comment