Producer Ravi Shankar: జానీ మాస్టర్ వివాదంపై స్పందించిన ‘పుష్ప’ నిర్మాత !

జానీ మాస్టర్ వివాదంపై స్పందించిన ‘పుష్ప’ నిర్మాత !

Ravi Shankar: తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ప్రస్తుతం రిమాండ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ‘పుష్ప’ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌(Ravi Shankar) ఎర్నేని స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మత్తు వదలరా 2’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జానీమాస్టర్‌ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ , డైరెక్టర్‌ సుకుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి ?’ అనే ప్రశ్నకు రవిశంకర్‌(Ravi Shankar) బదులిస్తూ… ‘‘ప్రస్తుతం నడుస్తున్న వివాదం పూర్తీగా వాళ్ల (జానీ మాస్టర్, బాధితురాలు) వ్యక్తిగతం.

Ravi Shankar Comment

‘పుష్ప 2: ది రూల్‌’ సినిమాకి గణేశ్‌ ఆచార్య మెయిన్‌ కొరియోగ్రాఫర్‌. విజయ్‌ పోలకి, ఆ అమ్మాయి (బాధితురాలు) అడిషనల్‌ కొరియోగ్రాఫర్‌ గా పనిచేస్తున్నారు. ‘పుష్ప 2: ది రూల్‌’ప్రారంభం నుంచే ఆ అమ్మాయిని తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె పని చేస్తారు. ఐదారు నెలల క్రితం మేము రిలీజ్‌ చేసిన ఓ లిరికల్‌ వీడియోలోనూ ఆమె పేరు ఉంటుంది. ప్రస్తుతం రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. అక్టోబర్‌ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేశాం. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాటని జానీ మాస్టర్‌తో చేయించాలనుకున్నాం. ఇంతలోగా ఈ గొడవ తెరపైకి వచ్చింది.

ఎవరైనా డ్యాన్స్‌ మాస్టర్స్, డ్యాన్సర్‌ గుడ్‌ మార్నింగ్, గుడ్‌ ఈవెనింగ్‌ చెబితే స్పందించడం తప్ప అల్లు అర్జున్‌ ఏమీ తెలియదు. ఈ విషయంపై బాధ్యత కలిగిన ప్రధాన మీడియా వార్తలు రాయడం లేదు. కానీ, కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ సెన్సేషన్ కావడం కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. జానీ మాస్టర్‌ ని ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్‌ చేయాలనే వ్యక్తిత్వం బన్నీగారిది కాదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇదంతా కొందరి అలజడి మాత్రమే. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దాని గురించి మనం మాట్లాడటానికి కూడా ఏం లేదు’’ అన్నారు.

Also Read : TUMMBAD: రీ రిలీజ్ లో రికార్డ్ సృష్టించిన బాలీవుడ్ డిజాస్టర్ ‘తుంబడ్’ !

allu arjunJani MasterProducer Ravi ShankarPuspha 2
Comments (0)
Add Comment