Jaffer Sadiq: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ లొ కోలీవుడ్ నిర్మాత !

అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ లొ కోలీవుడ్ నిర్మాత !

Jaffer Sadiq: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ లో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న కోలీవుడ్ నిర్మాత, డీఎంకే బహిష్కృత నేత జాఫర్‌ సాదిక్‌ ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)అధికారులు అరెస్ట్‌ చేశారు. కొబ్బరి పొడి, మిక్స్‌ ఫుడ్‌ పౌడర్‌ మాటున సూడో ఎఫెడ్రిన్ అనే నిషేదిత మాదక ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మలేషియా దేశాలకు తరలించినట్లు నిర్ధారణకు వచ్చిన ఎన్‌సీబీ అధికారులు… ఢిల్లీ, పుణే లోని పలుచోట్ల దాడులు నిర్వహించారు. ఢిల్లీలో సాదిక్‌కు(Jaffer Sadiq) చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడో ఎఫెడ్రిన్‌ దొరికింది. ఈ మేరకు సాదిక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జ్ఞానేశ్వర్‌ సింగ్‌ తెలిపారు.

Jaffer Sadiq in Drugs Case..

ఈ సందర్భంగా ఎన్‌సీబీ(NCB) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జ్ఞానేశ్వర్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘‘భారత్‌ నుంచి కొబ్బరి పొడి, మిక్స్‌ ఫుడ్‌ పౌడర్‌లో కలిపిన సూడో ఎఫెడ్రిన్‌ తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు ఇచ్చిన సమాచారం మేరకు సాదిక్ కు చెందిన కంపెనీలపై దాడులు నిర్వహించాము. ఈ దాడుల్లో సుమారు 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ దొరికింది. ఇటీవల కాలంలో సాదిక్ సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన సూడో ఎఫెడ్రిన్ ను విదేశాలకు అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించాం. సాదిక్‌ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తమిళ, హిందీ సినీ రంగ ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయి. పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాదిక్‌ నుంచి ముడుపులందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని చెప్పారు. త్వరలో అతనిపై మనీ లాండరింగ్‌ కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

పైరేటెడ్‌ సీడీల నుంచి సూడో ఎఫెడ్రిన్ అక్రమ రవాణా వరకు ఎదిగిన సాదిక్

సాదిక్‌ దందా పైరేటెడ్‌ సీడీలతో మొదలైంది. కెటమైన్‌ డ్రగ్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు స్మగ్లింగ్‌ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లోకి పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్‌ డ్రగ్‌. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్‌కు అంతర్జాతీయ మార్కెట్‌ లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది.

Also Read: Manjummel Boys: లూసిఫర్‌ రికార్డును బద్దలుకొట్టిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ !

Jaffer SadiqProducer in Drugs Case
Comments (0)
Add Comment