Kalki 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీనికి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. గోవాలో జరుగుతున్న ‘ఇఫ్ఫీ’ వేడుకల్లో చిత్ర నిర్మాతలు స్వప్న- ప్రియాంక.. దీని షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘పార్ట్ 2(Kalki 2)కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అన్ని సిద్ధమయ్యాక ప్రకటిస్తాం. ‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె.. పార్ట్ 2లోనూ కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనున్నారు’’ అని అన్నారు. ‘కల్కి 2898 ఏడీ’తో పాటే సీక్వెల్‌కు సంబంధించిన షూట్‌ను కొంతమేర తీసినట్లు తెలిపారు. పార్ట్ 2కు సంబంధించి 35 శాతం షూట్ జరిగిందని వివరించారు. గోవా వేదికగా జరుగుతున్న ‘ఇఫ్ఫి’ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న ఆదరణ చూస్తుంటే గర్వంగా ఉందన్నారు స్వప్నదత్.
Kalki 2 Movie Updates
వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, కమల్ హాసన్.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ క్లైమాక్స్‌లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై అంచనాలు పెంచేశారు. రెండో భాగంలో అసలైన కథ మొదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.
Also Read : Naga Chaitanya : తన కాబోయే భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య