Hero Vijay Varisu Movie : విజ‌య్ వారిసు భారీ లాస్

ఐటీ అధికారుల‌కు నిర్మాత వెల్ల‌డి

Vijay : ప్ర‌ముఖ నిర్మాత‌, తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఎప్ప‌టి లాగే ఆదాయ ప‌న్ను శాఖ దాడులు చేసింది. దిల్ రాజు తో పాటు పుష్ప -2 మూవీ నిర్మాత‌ల ఇళ్లు, ఆఫీసుల‌పై సోదాలు చేప‌ట్టింది. మొత్తం హైద‌రాబాద్ లోని ఎనిమిది చోట్ల దిల్ రాజుకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల‌పై దాడులు చేసింది. ఈ సంద‌ర్బంగా దిల్ రాజుతో పాటు త‌న కూతురు, బంధువుల ఇళ్ల‌ను కూడా జ‌ల్లెడ ప‌ట్టింది.

Vijay Varisu Movie Loss..

ఈ సంద‌ర్భంగా ఆయా బ్యాంకుల‌లో ఉన్న లాక‌ర్ల‌ను కూడా ఓపెన్ చేసి చూపించారు. ఐటీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఏమిట‌నే దానిపై ఆరా తీశారు. ఐటీ శాఖ‌కు సంబంధించి 55 బృందాలు విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టాయి.

ఈ సంద‌ర్బంగా లాక‌ర్ల‌ను తెరిచి చూపించామ‌ని స్ప‌ష్టం చేశారు దిల్ రాజు రెండో భార్య తేజ‌స్విని రాజు. కాగా విస్తు పోయేలా ఐటీ శాఖ‌కు వివ‌రాలు వెల్ల‌డించ‌డం విశేషం. త‌మిళ సినీ దిగ్గ‌జ న‌టుడు విజ‌య్(Vijay) తో తీసిన వారిసు మూవీ పూర్తిగా లాస్ వ‌చ్చింద‌న్నాడు. మొత్తంగా ఈ సినిమా క‌లెక్ష‌న్లు రూ. 120 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌న్నాడు. రూ. 40 కోట్లు న‌టుడికి ఇచ్చామ‌ని, 60 కోట్లు న‌ష్ట ప‌రిహారం కింద ఇచ్చామ‌న్నారు.

కొడుకు శిరీష్‌, కూతురు , బంధువుల ఇళ్లు, ఆఫీసులు జ‌ల్లెడ ప‌ట్టారు. మ‌రో వైపు మైత్రీ మూవీ మేక‌ర్స్ కు షాక్ ఇచ్చారు.

Also Read : Beauty Rashmika Health : గాయ‌ప‌డిన మంద‌న్నా ఫ్యాన్స్ ఆందోళ‌న

CinemaHero VijayUpdatesVarisuViral
Comments (0)
Add Comment