Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ పై దిల్‌ రాజు కీలక ప్రకటన !

‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ పై దిల్‌ రాజు కీలక ప్రకటన !
Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ పై దిల్‌ రాజు కీలక ప్రకటన !

Game Changer: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషించగా… ఎస్.ఎస్. థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, రచయిత కార్తిక్‌ సుబ్బరాజ్‌ అందించిన పొలిటికల్‌, యాక్షన్‌ కథను ‘గేమ్‌ ఛేంజర్‌’ గా శంకర్ తెరకెక్కిస్తున్నారు. దీనితో ఈ సినిమా విడుదల కోసం మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ కు మెగా అభిమానులతో పాటు శంకర్ అభిమానుల నుండి విశేషమైన స్పందన వచ్చింది.

Game Changer Updates

క్రేజీ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌(Game Changer)’ ఎప్పుడొస్తుందా ? అని చరణ్‌ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని ధనుష్ ‘రాయన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో అభిమానులు ఆ విషయమై అడగ్గా నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. క్రిస్మస్‌కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీనితో ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్ అప్‌డేట్‌ పై ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు ‘గేమ్‌ ఛేంజర్‌(Game Changer)’ సినిమాని తెరకెక్కిస్తూ దర్శకుడు శంకర్‌ ‘భారతీయుడు 2’ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘గేమ్‌ ఛేంజర్‌’ ఇప్పుడప్పుడే రాదని చాలామంది ఫిక్స్‌ అయ్యారు. ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న శంకర్‌ని ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ ఏడాదిలో వస్తుందా ? అని విలేకరులు ప్రశ్నించగా ఫైనల్‌ ఎడిటింగ్‌ అయ్యాక విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. ఈలోగా దిల్‌ రాజు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇ

‘నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైంది’’ అంటూ శంకర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ ఈ చిత్రంపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి.

Also Read : Mrunal Thakur: స్వచ్ఛమైన ప్రేమ కథతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సీతారామం బ్యూటీ !

dil rajugame changerram charansankar
Comments (0)
Add Comment