Dil Raju : టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా, సక్సెస్ ఫుల్ చిత్రాలతో దూసుకెళుతోన్న నిర్మాత దిల్ రాజు(Dil Raju). వరుస చిత్రాలతో టాలీవుడ్‌లో బిజీగా ఉండే ఆయన.. ఇప్పుడు అందరికీ ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారందరికీ దిల్ ఖుష్ లాంటి వార్త చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తన ఫ్యూచర్ ప్లాన్‌ని రివీల్ చేశారు. ‘‘జనవరి 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్‌గారితో చేసిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపూడిల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర విడుదల ఉంటుంది. నితిన్‌తో చేస్తున్న ‘తమ్ముడు’ చిత్రం శివరాత్రికి రిలీజ్ చేయనున్నాం. ఇవి కాకుండా నితిన్‌తో వేణు కాంబినేషన్‌లో ‘యల్లమ్మ’, యష్ మాస్టర్ హీరోగా ఒక సినిమా, ఆశిష్ హీరోగా చేస్తున్న ‘సెల్ఫిష్’.. ఇలా అనేక సినిమాలతో బిజీగా ఉన్నాం. ఇవి కాకుండా ‘జటాయి’ అనే పాన్ ఇండియా సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ సినిమా వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తాం.
Dil Raju New Banner
యంగ్జనరేషన్‌తో సినిమాలు చేయాలని ఉంది. ఎందుకంటే, ఎందుకో నేను కొంత ఈ జనరేషన్‌కు డిస్కనెక్ట్ అయ్యానా అని అనిపిస్తుంది. గతంతో నా జర్నీలో అన్నీ అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అందరి స్టార్ హీరోలతో చేశాము. ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అయింది. ఇప్పుడు మా వద్ద కంటెంట్‌కి కొదవలేదు. చాలా కంటెంట్ సిద్దం చేశాము. వరుస సినిమాలు చేస్తున్నాము కాబట్టి గ్యాప్ రాకూడదని, న్యూ టాలెంట్స్‌ను ఎంకరేజ్ చేయాలని కొత్త బ్యానర్ ‘దిల్ రాజు(Dil Raju) డ్రీమ్స్’ పేరుతో రాబోతున్నాం. యంగ్ జనరేషన్‌కు ఇదొక అద్భుతమైన ప్లాట్‌ఫామ్. 360 డిగ్రీస్‌లో అందుబాటులో ఉండాలనే థాట్‌తో ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు (కార్తీక సోమవారం) లోగోను లాంఛ్ చేస్తున్నాము.
ఇండస్ట్రీలోచాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవ్వరికీ తెలీదు. నా దగ్గరకు చాలా మంది వచ్చి పోస్టర్‌లు, టీజర్‌లు రిలీజ్ చేయమని అడుగుతారు. అవి చూడగానే నాకు అర్థం అవుతుంది. ఇలాంటి చిత్రాలు ఎందుకు తీస్తారు.. ఎవరు చూస్తారు? అని చెప్పేస్తాను. అక్కడ ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుస్తుంది. అందుకే ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయాలని, సరైన ఫ్లాట్ ఫాం ఉండాలని దిల్ రాజు(Dil Raju) డ్రీమ్స్‌ను స్థాపించాను. ‘దిల్ రాజు డ్రీమ్స్’కు అనేక టీమ్స్‌ను ఫామ్ చేశాం. కథలు, సినిమాల నిర్మాణం, విడుదల వరకు.. న్యూటాలెంట్‌కు సపోర్ట్ చేయాలనేదే మా ఆలోచన. దీనికోసం ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేశాము. త్వరలోనే దానిని లాంచ్ చేయనున్నాం. ఇదంతా కార్పొరేట్ స్టయిల్‌లో ఆర్గనైజ్డ్ సిస్టమ్‌గా ఉంటుంది. స్క్రిప్ట్ రివ్యూ పేరుతో ఎక్స్‌పెరిమెంట్ కూడా చేయాలనుకుంటున్నాము. మీడియా వారిని ఈ విషయంలో ఇన్ వాల్వ్ చేయాలనుకుంటున్నాము. ఇదే నా పూర్తి ఆలోచన. అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం..’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
Also Read : Rashmika Mandanna : మూడు భాషల్లో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ ‘రష్మిక’