Hero Nani- Hit 3 :నాని హిట్ 3 పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఫోక‌స్

థియేట్రిక‌ల్ రైట్స్ దిల్ రాజు స్వంతం 

Hit 3 : నేచుర‌ల్ స్టార్ నాని సంచ‌ల‌నంగా మారారు. తాజాగా త‌ను న‌టిస్తున్న హిట్ 3 మూవీకి సంబంధించి విడుద‌ల చేసిన టీజ‌ర్, పోస్ట‌ర్స్ నెట్టింట్లో షేక్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ స్పీడ్ గా కొన‌సాగుతోంది. ఎలాగైనా స‌రే వ‌చ్చే మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Hero Nani Hit 3 Movie Updates

ఇదిలా ఉండ‌గా హిట్ 3(Hit 3) మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అదేమిటంటే స్టార్ నిర్మాత దిల్ రాజు థియేట్రిక‌ల్ రైట్స్ తీసుకున్నార‌ని. అయితే ఈ విష‌యానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఖ‌రారు చేయ‌లేదు దిల్ రాజు.

తెలంగాణతో పాటు ఏపీలో కూడా రైట్స్ కొనుగోలుకు ఆస‌క్తి చూపించిన‌ట్లు టాక్. ఇక హిట్ 3 సినిమాకు సంబంధించి విడుద‌లైన టీజ‌ర్ రికార్డు బ్రేక్ చేస్తోంది. మిలియ‌న్స్ వ్యూస్ ను రాబ‌ట్టింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నాని డైలాగులు, యాక్ష‌న్ ఆక‌ట్టుకునేలా చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ కింగ్ డ‌మ్ టీజ‌ర్ వ్యూస్ ను దాటేసింది.

అర్జున్ స‌ర్కార్ లాఠీ చేత ప‌ట్టాడంటే వాడి చేతికి దొరికినోడి ప‌రిస్థితి దారుణంగా ఉంటుంది..ఆలోచిస్తేనే భ‌యం వేస్తోంది అంటూ రిలీజ్ చేసిన టీజ‌ర్ కెవ్వు కేక అనేలా ఉంది. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది శ్రీ‌నిధి శెట్టి. ఈ మూవీకి మిక్కీ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Also Read : Hero Kiran Abbavaram :కిర‌ణ్ అబ్బ‌వ‌రం బంప‌ర్ ఆఫ‌ర్

CinemaHero NaniHit-3TrendingUpdates
Comments (0)
Add Comment