Producer Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డితో, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి వివాహానికి సమయం ఆసన్నమైంది. ఈనెల 14న జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ గా ఏర్పాట్లు చేసారు ఇరు కుటుంబాలు. ఈ నేపథ్యంలో కాబోయే దంపతులతో కలిసి ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు దిల్ రాజు. ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, మంచు మోహన్ బాబుల వద్దకు ప్రత్యేకంగా వెళ్లి పెళ్ళికి ఆహ్వానించిన దిల్ రాజు(Dil Raju)… తాజాగా వివాహా వేడుక కోసం ఫ్యామిలీతో కలిసి జైపూర్ బయలుదేరి వెళ్లారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కు జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు నిర్మాత దిల్ రాజు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Producer Dil Raju Family Function
దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో గతేడాది డిసెంబరులో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్ లో ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీనితో కాస్తా గ్యాప్ తీసుకున్న ఆశిష్ రెడ్డి ప్రస్తుతం విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
Also Read : Ruhani Sharma: ‘ఆపరేషన్ వాలెంటైన్’ లో పైలట్ గా రుహాని శర్మ !