Apple : ఆపిల్‌తో పాటు గింజలు తింటున్నారా?

పొరపాటున ఆపిల్ గింజలు తింటున్నారా?

Apple : ఆపిల్స్ అంటే చాలా మందికి ఇష్టం. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఉదయం ఒక ఆపిల్ తింటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే లేదంటారు పెద్దలు.అంటే ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Apple Seeds Issues

అయితే ఆపిల్స్‌ను కొంత మంది తొక్క తీసి తింటే మరికొందరు తొక్క తీయకుండా తింటారు.దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఆపిల్‌తో పాటు గింజలు అస్సలే తినకూడదు అంటున్నారు వైద్యులు.ఆపిల్(Apple) గింజల్లో అమిగ్దాలిన్ అనే విష పదార్థం ఉంటుందని కొన్ని పరిశోధనల్లో తేలిందంట. వీటిని తిన్నా,నమిలినా అమిగ్దాలిన్ హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం అంట. అందుకే ఆపిల్ గింజలు తినకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఒక వేళ ఆపిల్ గింజలు తింటే శరీరంలోని కణాలకు ఆక్సిజన్ చేరకుండా చేస్తాయంట. ఫలితంగా తలనొప్పి, గందరగోళం, అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయంట. అలాగే బాడీలో సైనైడ్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు మూర్ఛవంటి ప్రాణాంతక వ్యాధులు రావచ్చు అంటున్నారు నిపుణులు.

Also Read : Papaya : బొప్పాయి తింటే నిజంగానే గర్భం పోతుందా?

AppleApple NutsHealth Tip
Comments (0)
Add Comment