Kangana : ప్రముఖ వివాదాస్పద నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్(Kangana) తాజాగా దర్శకత్వం వహంచి నటించిన ఎమర్జెన్సీ చిత్రం చర్చనీయాంశంగా మారింది. వరల్డ్ వైడ్ గా దీనిని రిలీజ్ చేశారు. సిక్కుల మనో భావాలను కించ పరిచేలా ఉన్నాయంటూ ఈ చిత్రాన్ని పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే బ్యాన్ చేసింది. మరో వైపు బ్రిటన్ లో కూడా కంగనా మూవీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి.
Kangana Emergency Movie…
ఖలిస్తానీ మద్దతుదారులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించ వద్దంటూ డిమాండ్ చేశారు. లేకపోతే టాకీసులను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు. ప్రస్తుతం తమకంటూ ప్రత్యేక దేశం కావాలని గత కొంత కాలంగా కెనడా, బ్రిటన్ లో ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. దీనిపై మోడీ సర్కార్ ఉక్కు పాదం మోపింది.
ఇక ఎమర్జెన్సీ సినిమా భారత దేశ రాజకీయ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలి పోయింది. ఆనాటి దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారు. ఇది 1975 నుంచి 1977 దాకా రెండేళ్ల పాటు కొనసాగింది. దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన నేతలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, మేధావులు, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, కేసులు నమోదు చేయడం జరిగింది.
దీనిని ఆధారంగా చేసుకుని కంగనా రనౌత్ ఎమర్జెన్సీ పేరుతో కళ్లకు కట్టినట్లు చిత్రీకరించింది. ఇదిలా ఉండగా కంగనా సినిమాపై నిషేధం తగదంటూ ఆమెకు మద్దతుగా పార్లమెంట్ లో తన గొంతు విప్పారు ఎంపీ బాబ్ బ్లాక్ మెన్.
Also Read : Janhvi Kapoor Interesting : శ్రీవారి సన్నిధి లోనే శేష జీవితం