Priyanka Mohan : జయం రవి తో దండలు మార్చుకోవడం పై స్పందించిన ప్రియాంక మోహన్

ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఒక ఫొటో రిలీజ్‌ చేసింది...

Priyanka Mohan : ఇటీవల తన భార్యకు విడాకులిచ్చారు జయం రవి. తాజాగా ఆయనపై మరో వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నటి ప్రియాంక మోహన్‌ తో ఆయనకు నిశ్చితార్థం జరిగిందంటూ ఇటీవల పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వార్తలపై తాజాగా ప్రియాంక మోహన్‌(Priyanka Mohan) క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు చూసి షాకయ్యా అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Priyanka Mohan Comment

‘‘జయం రవి, నేను కలిసి ‘బ్రదర్‌’ సినిమా కోసం వర్క్‌ చేశాం. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఒక ఫొటో రిలీజ్‌ చేసింది. అందులో మేమిద్దరం మెడలో పూల దండలు వేసుకుని ఉంటాం. దాంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి చాలామంది మాకు ఎంగేజ్‌మెంట్‌ అయిందనుకున్నారు. వరుస షూట్స్‌తో బిజీగా ఉండటంతో ఆ విషయం నా దృష్టికి రాలేదు.

ఆ సమయంలో ఇది నిజమేనని నమ్మిన టాలీవుడ్‌లోని నా స్నేహితులు నాకు కాల్స్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్పారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. పూర్తి విషయం తెలుసుకుని అది కేవలం సినిమాలోని స్టిల్‌ మాత్రమేనని చెప్పా. వేరే ఫొటో ఏదైనా రిలీజ్‌ చేయొచ్చు కదా అని సినిమా టీమ్‌ను తిట్టుకున్నా. ఇది ఎందుకు చేశారనుకున్నా. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇది ఎప్పటికీ మరువలేని ఘటన’’ అని ప్రియాంక మోహన్‌ తెలిపారు. ప్రియాంక నటించిన ‘బ్రదర్‌’ విడుదలకు సిద్థంగా ఉంది. ‘ నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక మోహన్‌. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో వరుస చిత్రాలు చేస్తున్నారు. ‘ సరిపోదా శనివారం’తో ప్రియాంక విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’ కోసం వర్క్‌ చేస్తున్నారు.

Also Read : Sai Durgha Tej : తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన సుప్రీమ్ హీరో

CommentsJayam RaviPriyanka MohanUpdatesViral
Comments (0)
Add Comment