Priyanka Jain : తిరుమల పవిత్రతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతుంది. అలాంటి వేళ… తిరుమల పవిత్రను తమ చేష్టలతో దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. బుధవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గంలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్(Priyanka Jain) తన వెకిలి చేష్టలతో వార్తల్లో నిలిచింది. బాయ్ ఫ్రెండ్ శివకుమార్‌తో కలిసి తిరుమలకు ప్రియాంక విచ్చేసింది. ఆ క్రమంలో తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైలు రాయి వద్ద తన ప్రియుడితో కలిసి ప్రియాంక రీల్స్ చేసింది. చిరుత పులి వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు.
Priyanka Jain Photos..
అనంతరం‘తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్? అంటూ షాకింగ్ అయిన ఫొటోలతో వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. ఈ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక జైన్‌తోపాటు శివకుమార్‌పై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారు కొలువు తీరిన తిరుమల ప్రాంతంలో ప్రాంక్ వీడియోల పేరుతో ఇదేం పని అంటూ మండిపడుతున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తూ ఇటువంటి ప్రాంక్ వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా టీటీడీని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
బుల్లితెరలో ప్రసారమవుతున్న పలు సీరియళ్లలో ప్రియాంక జైన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆమె అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో అందరిని మెప్పించింది. దీంతో ఆమె టాప్ 5లో నిలిచింది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే.. తన ప్రియుడు, బుల్లి తెర నటుడు శివకుమార్‌ను ఆమె అందరికీ పరిచయం చేసిన విషయం విధితమే. వీరిద్దరు గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ ప్రచారం అయితే సాగుతుంది.
Also Read : Zulfi Ravdjee : అఖిల్ మామ దుబాయ్ లో అంత పెద్ద బిజినెస్ టైకూనా..?