Priyanka Jain: బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకున్న ఈ బుల్లితెర నటి… బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్ ను అభిమానులకు పరిచయం చేసింది. హౌస్ నుంచి బయటకు రాగానే గుడ్ న్యూస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చింది. దీనితో శివకుమార్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఫ్యాన్స్ భావించారు.
Priyanka Jain Marriage Updates
అయితే ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్ డేట్స్ ఇస్తూ ఉండే ప్రియాంక(Priyanka Jain) సడన్ గా తన అభిమానులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా తన ప్రియుడిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ… మా పెళ్లి అయిపోయింది అంటూ ప్రకటించారు. రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రకటించాడు శివకుమార్. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తీరా చూస్తే ఇదంతా షూటింగ్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మా ఇంటి పండుగ అనే షూటింగ్ జరిగింది. ఇందులో ప్రియాంక, శివ కుమార్‌కు పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజైంది.
Also Read : Aparna Das: మంజుమ్మెల్ బాయ్స్ హీరోతో నటి అపర్ణా దాస్ పెళ్లి !