Priyanka Chopra : బాలీవుడ్‌తో పాటు గ్లోబల్‌స్టార్ అయ్యారు హిందీ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఇప్పుడు బాలీవుడ్‌లోపాటు హాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారామె. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓటీటీలు, ధియేటర్ల గురించి మాట్లాడారు. “ఓటీటీ, థియేటర్‌లు రెండూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ప్రేక్షకులకు 24 గంటలు ఎన్నో విధాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులో ఉంటోంది. బిగ్ స్క్రీన్ పై సినిమా చూడడం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. చీకటిగా ఉండే ప్రదేశంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతోపాటు తెలియని ఎంతో మంది వ్యక్తుల మధ్యలో కూర్చొని చూస్తే సినిమా అద్భుతమైన అనుభూతినిస్తుంది. అంత పెద్ద స్క్రీన్, డిజిటల్ సౌండ్, థియేటర్ వాతావరణం అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందుకే ఓటీటీలు వచ్చినప్పటికీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. పెరుగుతున్న సాంకేతికత సినిమా పురోగతికి ఉపయోగపడుతోంది. త్రీడీ, ఐమాక్స్‌లలో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఇవి ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరగడానికి ఉపయోగపడుతున్నాయి’’ అని అన్నారు.
Priyanka Chopra Comment
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక(Priyanka Chopra) అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను తిరిగి బాలీవుడ్‌కు రావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. భారతీయ సినిమాలు ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉన్నాయని అన్నారు. త్వరలోనే ఓ హిందీ సినిమా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక సిటడెల్ రెండో భాగాన్ని పూర్తి చేసిన ప్రియాంక.. మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
Also Read : Anurag Kashyap : డైరెక్టర్ శంకర్ ‘గేమ్ ఛేంజర్’ పై అసహనం వ్యక్తం చేసిన మరో డైరెక్టర్