Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అనుకోకుండా ముంబై లోని తన లగ్జరీ అపార్ట్మెంట్లను అమ్మేసినట్లు టాక్. భారీ ధరకు సేల్ చేయడం విశేషం. నగరంలో ఉన్న లగ్జరీ ఫ్లాట్స్ ను రూ. 13 కోట్లకు విక్రయించింది. ఈ అపార్ట్మెంట్స్ అంధేరి వెస్ట్ లోని లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఆస్తి లావాదేవీలను బహిరంగంగా ప్రకటించారు. ప్రియాంక చోప్రాకు(Priyanka Chopra) సంబంధించిన ఫ్లాట్స్ ను సచ్ దేవా కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు.
Priyanka Chopra Sold..
నటికి సంబంధించి 1,075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ ను రూ. 3.45 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి రూ. 17.26 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. మరో అపార్ట్ మెంట్ ను రూ. 2.85 కోట్లకు అమ్మగా రూ. 14.25 లక్షల స్టాంప్ డ్యూటీ కట్టారు. ఇక 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ ను రూ. 3.52 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ. 21.12 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించడం విశేషం.
వీటితో పాటు 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డ్యూప్లెక్స్ ఫ్లాట్ ను అమ్మేసింది. దీనిని రూ. 6.35 కోట్లకు కొనుగోలు చేశారు. రూ. 31.75 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. వీటికి కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇదిలా ఉండగా 2023లో ఇదే అంధేరి శివారు లోని 2 ఫ్లాట్స్ ను దర్శకుడు అభిషేక్ చౌబికి విక్రయించింది. ప్రస్తుతం తను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న ఎస్ఎస్ఎంబీ29 చిత్రంలో నటిస్తోంది.
Also Read : CEO Archana Appreciates Pradeep :ప్రదీప్ గొప్ప నటుడే కాదు మనసున్నోడు