SSMB29 : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న వరల్డ్ అడ్వంచర్ మూవీ ఎస్ఎస్ఎంబీ29(SSMB29)కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎవరు ఈ మూవీలో ప్రధాన విలన్ గా నటించ బోతున్నారని. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించేందుకు ఇష్ట పడలేదు దర్శకుడు.
SSMB29 Updates
తను ఏ మూవీ తీసినా అప్ డేట్స్ అంటూ ఇచ్చేందుకు ఒప్పుకోడు. ఇది తన స్పెషాలిటీ. ప్రత్యేకించి తన తండ్రి, బీజేపీ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ రాసి కథ. పూర్తిగా కౌబాయ్ ప్రధాన అంశంగా దీనిని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇది పక్కన పెడితే ఊహించని రీతిలో ఖర్చు చేయనున్నారని ప్రచారం ఊపందుకుంది.
ఇక బాలావుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ బాబు సరసన నటించ బోతోందని, అందుకే ఆమె హైదరాబాద్ లో అడుగు పెట్టిందని , గుళ్లు గోపురాలు తిరుగుతోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. అయితే దాదాపు ఖరారైందని , కానీ తను ఫీమేల్ రోల్ లో కంటే విలన్ గా నటిస్తున్నట్లు మరో వార్త గుప్పుమంది. సామాజిక మాధ్యమాలలో తనే ప్రతినాయకి పాత్రకు జక్కన్న ఏరికోరి ఎంపిక చేశాడంటున్నారు.
ఇది పక్కన పెడితే మరో హీరోయిన్ కోసం రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడని , కొందరిని ఇప్పటికే పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఏది ఏమైనా జక్కన్న మూవీ అంటే మామూలుగా ఉండదు. తను తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Also Read : Hero Chiranjeevi-Vanga: చిరంజీవికి కథ చెప్పానన్న వంగా