Priyanka Chopra: అస్ట్రేలియాలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గాయ పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గత సంవత్సరం లవ్ ఎగైన్ అనే రొమాంటిక్ హాలీవుడ్ సినిమాలో కనిపించిన ప్రియాంకా చోప్రా… ప్రస్తుతం ది బ్లప్, హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే రెండు హాలీవుడ్ చిత్రాలలో కార్ల్ అర్బన్, ఇద్రీస్ ఎల్బా, జాన్ సీనా వంటి స్టార్ హాలీవుడ్ హీరోల సరసన నటిస్తోంది. తాజాగా ది బ్లప్ అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్ అస్ట్రేలియాలో జరుగుతుండగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈక్రమంలోనే సెట్ లో జరిగిన ప్రమాదంలో నటి ప్రియాంక చోప్రాకు గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రయాంక గొంతు వద్ద గాయాలయినట్లు తెలుస్తోంది.
Priyanka Chopra Accident
ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో ప్రోఫెషనల్ లైఫ్ లో సవాళ్లు… బ్లఫ్, స్టంట్స్ అంటూ పోస్టు చేసింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌ను నిలిపి వేసి ప్రియాంకను సిడ్నీకి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్యంగానే ఉన్నారని రెండు మూడు రోజుల్లో తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలిసింది. దీనితో గెట్ వెల్ సూన్ అంటూ అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Kamal Haasan Biopic : కమల్ హాసన్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన శృతి