Priyanka Chopra: బాలీవుడ్ స్మైలీ బ్యూటీ ప్రియాంక చోప్రా… హాలీవుడ్ లో బిజీ స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో ఎప్పుడూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఈ బ్యూటీ…. హాలీవుడ్ కి వెళ్ళిన తరువాత మెల్లమెల్లగా అక్కడి డ్రెస్ సెన్స్ కు బాగా కనెక్టైయింది. ప్రస్తుతం ఆమె మూడు వరుస హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ… చుట్టం చూపుగా ఇండియాకు వచ్చి వెళ్తోంది.
Priyanka Chopra…
ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘ది బ్లఫ్’ సినిమా చిత్రీకరణను పరుగులు పెట్టిస్తోంది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రమిది. 19వ శతాబ్దంలో ఎర్సెల్ అనే మహిళ తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యం చుట్టూ తిరిగే కథనంతో ఈ హాలీవుడ్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సముద్రపు దొంగ అయిన ఎర్సెల్ పాత్రలో ప్రియాంక కనిపించనుంది. తాజాగా ఈమె పాత్రకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. మోహాక్ హెయిర్ స్టై ల్‌తో కొత్త అవతారం ఎత్తిన ప్రియాంక తన లుక్‌తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొన్ని వారాల నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఏజీబీఓ పతాకంపై నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో కార్ల్ అర్బన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Also Read : Ananya Panday: ఒకవైపు హార్దిక్ తో డేటింగ్ రూమర్స్, మరోవైపు ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ !