Hero Mahesh : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న పాన్ వరల్డ్ అడ్వంచర్ మూవీ ఎస్ఎస్ఎంబీ29 పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. అప్ డేట్ కూడా ఇచ్చేశాడు జక్కన్న. సోషల్ మీడియా వేదికగా ఓ సంచలన పోస్టర్ ను రిలీజ్ చేశాడు. దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.
Hero Mahesh Babu-Priyanka Movie…
అయితే ఇప్పటి వరకు ప్రిన్స్ మహేష్ బాబు(Hero Mahesh) సరసన హీరోయిన్ గా నటిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో మహేష్, జక్కన్న ఫ్యాన్స్ మాత్రం తెగ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక రోల్ లో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రస్తుతం హాలీవుడ్ లో మకాం వేసింది. కానీ ఉన్నట్టుండి ఈ మధ్యనే హైదరాబాద్ కు విచ్చేసింది.
తను ఎక్కువగా దేవాలయాలను, చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తోంది. సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ వస్తోంది. కానీ సినిమాకు సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా చెప్పడం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అయితే అందరు మాత్రం ప్రిన్స్ సరసన ప్రియాంక చోప్రానే ఉంటుందని , ఇందులో సందేహం లేదంటున్నారు నెటిజన్స్. జక్కన్న రివీల్ చేస్తేనే కానీ చెప్పలేం అంటున్నారు మరికొందరు.
Also Read : Hero Chaitanya-Shobhita : తను నా జీవితంలో వెరీ వెరీ స్పెషల్