Allu Arjun : దేశ వ్యాప్తంగా సంచలనంగా మరారు దర్శకుడు అట్లీ కుమార్. తనతో ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో మూవీ కన్ ఫర్మ్ చేశాడు. సన్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్టార్ హీరోయిన్స్ ఇందులో కీ రోల్ పోషించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. బన్నీతో పాటు ప్రియాంక చోప్రా నటించనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు దర్శకుడి నుంచి.
Allu Arjun-Priyanka Chopra Movie Updates
ప్రస్తుతం ప్రియాంక చోప్రాకు(Priyanka Chopra) భారీ డిమాండ్ ఉంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఒక్క సినిమాలో ముఖ్య భూమిక పోషిస్తోంది. మొదట్లో తన గురించి కన్ ఫర్మ్ చేయలేదు రాజమౌళి. పూర్తిగా సీక్రెసీ మెయింటెనెన్స్ చేయడం విశేషం. ఆయన తను ఏ మూవీ తీసినా వాటి గురించి ఎక్కువగా ప్రచారం చేసేందుకు ఒప్పుకోడు.
మొత్తంగా మూవీ పూర్తయ్యాకే పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సినిమా విడుదల చేస్తాడు. అల్లు అర్జున్, అట్లీ కుమార్ కు చెందిన ఈ మూవీ కోసం ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది సన్ ఇంటర్నేషనల్. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను కూడా దర్శకుడు సంప్రదించారని, ఈ మేరకు అటు వైపు నుంచి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబీ29 మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుందని, కొత్త మూవీ కోసం కూడా ఎక్కువగా డిమాండ్ చేసినట్లు వినికిడి.
Also Read : Beauty Tamannaah-Odela 2 :ముంబైలో ఓదెల 2 ట్రైలర్ రిలీజ్