Priyanka Chopra: 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని… తమిళన్ అనే తమిళ సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి… కోలీవుడ్, బాలీవుడ్, చివరకు హాలీవుడ్ కు వెళ్ళిన నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియాంక… ఇటీవల వరుస హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. గత కొంతకాలంగా హాలీవుడ్ కే పరిమితం అయిన ప్రియాంక చోప్రా… ఓ రెండు నెలల పాటు హాలీవుడ్ షూటింగ్ లకు విరామం ప్రకటించి… రెక్కలు కట్టుకుని ఇండియాలో వాలిపోయింది. గత రెండు నెలలుగా ఇండియాలోని వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంది.
Priyanka Chopra Restarted
ఇటీవల తన సోదరుడు సిద్ధార్ధ్ చోప్రా నిశ్చితార్ధం, కజిన్ మీరా చోప్రా పెళ్ళిలో సందడి చేసి… ఇతరత్రా వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రపంచ సుందరి దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి సెట్ లో అడుగుపెట్టింది. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ లో పాల్గొని మరల మేకప్ వేసుకుంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. దీనితో ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్ ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేసింది ప్రియాంకా చోప్రా. దీనితో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్ లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది.
Also Read : Nayanthara: అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తింటూ రోడ్లపై ఎంజాయ్ చేస్తున్న నయనతార !