Priyanka Chopra : ప్రముఖ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) వైరల్ గా మారారు. హోలీ రంగుల పండుగలో భాగం అయ్యారు. ఈ సందర్బంగా తన షూటింగ్ స్పాట్ లో రంగులు వేసుకున్న ఫోటోలను స్వయంగా షేర్ చేశారు. తను బిజీగా ఉన్నారు ప్రస్తుతం. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు , ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ29 (ఇంకా పేరు ఖరారు కాలేదు) మూవీ షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు దర్శకుడు జక్కన్న.
Priyanka Chopra Holi Celebrations
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని రైట్స్ చేజిక్కించు కునేందుకు భారీ డిమాండ్ ఉంటోంది. ఇదే సమయంలో ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది హైదరాబాద్ లో. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అవుట్ డోర్ లో కొనసాగుతోంది. ఒడిశా అడవుల్లో షూటింగ్ కు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించే పనిలో పడ్డాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.
ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా గత ఏడాది 2024లో జరిగిన హోలీ పండుగను అమెరికాలో తన భర్త తో కలిసి వేడుకలో పాల్గొంది. ఈసారి మాత్రం జక్కన్న షూటింగ్ లో జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా తను సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా పంచుకుంది. ఫోటోలు, వీడియో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఓ అందమైన క్యాప్షన్ కూడా జోడించింది. ఇది మాకు వర్కింగ్ హోలీ అంటూ పేర్కొంది.
Also Read : Hero Vijay-Varun Chakravarthy :దళపతి విజయ్ అంటే చచ్చేంత ఇష్టం