Priyanka Chopra : అందరి దృష్టి ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)పై పడింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ నేపథ్యంతో ఎస్ఎస్ఎంబీ29 పేరుతో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇది కనీవిని ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. గతంలో తాను తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ (రౌద్రం..రణం..రుధిరం) సినిమాలకు మించి ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు.
Priyanka Chopra Remuneration…
ఇప్పటి వరకు మెయిన్ రోల్ లో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తుండగా ఫిమేల్ రోల్ లో ఎవరు నటిస్తున్నారనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంచాడు. కాగా ప్రియాంక చోప్రా కన్ ఫర్మ్ అయి పోయిందని, అందుకే తను హాలీవుడ్ లో వెబ్ సీరీస్ , మూవీస్ వదిలేసి హైదరాబాద్ కు వచ్చేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మూవీకి సంబంధించి విలన్ పాత్రకు పృథ్వీ రాజ్ సుకుమారన్ తో పాటు జాన్ అబ్రహం ను చూస్తున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం ఫిమేల్ రోల్ కు సంబంధించి ప్రియాంక చోప్రాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ. 30 కోట్లు కావాలంటూ ముద్దుగుమ్మ డిమాండ్ చేసిందని..అందుకు జక్కన్న ఓకే చేసినట్లు నెట్టింట్లో వార్త చక్కర్లు కొడుతోంది.
Also Read : Hero Vishwak Laila Craze : థర్డ్ సింగిల్ రిలీజ్ ‘లైలా’ క్రేజ్