Priyanka Chopra : హైదరాబాద్ – ఇటు బాలీవుడ్ లో అటు హాలీవుడ్ లో నటిస్తూ బిజీగా మారి పోయిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సంచలనంగా మారారు. తను ఉన్నట్టుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు.
Priyanka Chopra Visit..
ఇదిలా ఉండగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (జక్కన్న) దర్శకత్వం వహిస్తున్న తదుపరి చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటించనుందని సమాచారం. అందుకే నగరంలో కాలు మోపింది. ఈ సినిమా పూర్తిగా హాలీవుడ్ రేంజ్ లో కౌబాయ్ తరహాలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడైన విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలతో ప్రపంచ వ్యాప్తంగా తన వైపు తిప్పుకునేలా చేసిన దర్శకుడు రాజమౌళి తీయబోయే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ స్థాయిగా తీయనున్నట్లు టాక్. ఇందులో ప్రిన్స్ మహేష్ బాబు కీలకమైన పాత్రలో నటించనున్నారు.
ఇక ప్రియాంక చోప్రా 23 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించ బోతున్నారు. ఎస్ఎస్ఎంబీ29 చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 2002లో అపురూపంలో నటించింది. ఆ తర్వాత ఇప్పుడు నటించబోతోంది. 2016లో ది స్కై ఈజ్ పింక్ అనే సినిమాలో నటించింది.
Also Read : Beauty Kiara Advani Gift : సోల్ మేట్ కు కియారా అద్వానీ సర్ ప్రైజ్ గిఫ్ట్