Priyamani : విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన సినిమా ‘భామా కలాపం’. ఈ సినిమాలో సాధారణ గృహిణిగా ఉన్న ప్రియమణిని(Priyamani)… మోస్ట్ డేంజరస్ లేడీగా దర్శకుడు అభిమన్యు చూపించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అచ్చతెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’ లో విడుదలైన ఈ ‘భామా కలాపం’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. దీనితో ‘భామా కలాపం’ కు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సారి కేవలం ఓటీటీలో కాకుండా థియేటర్ల లో కూడా ఈ ‘భామా కలాపం 2’ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Priyamani- ‘భామా కలాపం’ ఓటీటీలో… ‘భామా కలాపం 2’ థియేటర్లలో
ప్రియమణి ప్రధాన పాత్రలో దర్శకుడు అభిమన్యు తెరకెక్కించిన ‘భామా కలాపం’ ఓటీటీ వేదికగా విడుదలై ఆదరణ దక్కించుకుకోవడంతో దీనికి సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ సినిమాను నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ‘భామా కలాపం 2’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ సినిమాను మాత్రం నేరుగా థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘‘తొలి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ రెండో భాగం రూపొందుతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఇదొక మంచి విందులా ఉంటుంది’’ అంటూ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలిపింది.
మోస్ట్ డేంజరస్ లేడీగా వంటలక్క ప్రియమణి
ఇక భామా కలాపం సినిమా విషయానికి వస్తే యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసే ఒక సాధారణ గృహిణి ప్రియమణి… అనూహ్యంగా ఓ పెద్ద క్రైమ్ లో ఇరుక్కుంటుంది. అయితే ఈ క్రైమ్ నుండి బయటపడటానికి క్రిమినల్స్ కే ముచ్చెమటలు పట్టించేలా ప్రియమణి(Priyamani) మోస్ట్ డేంజరస్ లేడీగా మారుతుంది. ఓ సాధారణ గృహిణిని… మోస్ట్ డేజంరస్ లేడీగా దర్శకుడు అభిమన్యు హ్యాండిల్ చేసిన తీరుకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. దీనితో ఇప్పుడు భామా కలాపం 2ని తీస్తున్నారు.
పొలిమేర ను ఫాలో అవుతున్న భామా కలాపం
ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజయ్యాక దాని సీక్వెల్ కూడా అందులోనే వస్తుందనే నమ్మకాన్ని నిలువునా బ్రేక్ చేసి విజయం సాధించిన సినిమా మా ఊరి పొలిమేర 2. పొలిమేర సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసినప్పటికీ పొలిమేర 2ను మాత్రం థియేటర్లలో విడుదల చేయడంతో పాజిటివ్ టాక్ తో సుమారు 20 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. దీనితో నిర్మాతలు ఇప్పుడు పొలిమేర 3 ను రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని డిసైడయ్యారు. ఇప్పుడు పొలిమేర బాటలో ప్రియమణి భామా కలాపం నడుస్తోంది. భామా కలాపం సినిమా ఓటీటీలో రిలీజ్ అయి మంచి ప్రేక్షకాదరణ పొందటంతో… భామా కలాపం 2 ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : Balakrishna: ఓటీటీలోకి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’