Priyamani: స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్‌’తో వస్తున్న ప్రియమణి !

స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్‌’తో వస్తున్న ప్రియమణి !

Priyamani: ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ‘మైదాన్‌’. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌, దక్షిణాది అగ్రహీరోయిన ప్రియమణి(Priyamani) ప్రధాన పాత్రలో అమిత్‌ శర్మ రూపొందించించిన ఈ సినిమాను జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ డ్రీమ్ ప్రాజెక్టుగా గత ఆరేళ్ళుగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కు సిద్ధమైంది. ఫుట్ బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముంబై వేదికగా ట్రైలర్ ను లాంఛ్ చేసి సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించారు నిర్మాత బోనీ కపూర్. ఈ కార్యక్రమంలో అజయ్ దేవగణ్, ప్రియమణి తదితరులు పాల్గొన్నారు.

Priyamani – సినిమాపై ఆశక్తి పెంచిన ‘మైదాన్‌’ ట్రైలర్

‘మనది అతిపెద్ద దేశం కాదు. సంపన్న దేశమూ కాదు. ప్రపంచంలోని సగం మందికి కూడా మన గురించి తెలియదు. కానీ.. మనకు ఫుట్‌బాల్‌ ఆట మాత్రమే గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ ఆటను ఆడతారు’ అనే సంభాషణలతో ‘మైదాన్‌’ ట్రైలర్ మొదలైంది. దీనితో ‘మైదాన్‌’ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా ప్రియమణి(Priyamani) మాట్లాడుతూ… ‘అడుగడునా తన వారసత్వాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి… సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ మరపురాని ప్రయాణం తెరపైకి రాబోతుంది’ అని అన్నారు.

మరోవైపు ఈ సినిమా ట్రైలర్ ను అతిలోక సుందరి కుమార్తె జాన్వి కపూర్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ… తన తండ్రి బోనీ కపూర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. ‘‘‘మైదాన్‌’ సినిమా కోసం చిత్ర బృందం ఆరేళ్లు కష్టపడింది. కరోనా సమయంలో సమస్యలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే కథపై ఉన్న నమ్మకం అటువంటిది. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. ‘ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలంటే సినిమా నిర్మించాలి. కానీ అది చిన్నవిషయం కాదు. అందులో రిస్క్‌ ఉంటుంది. సినిమా హిట్‌ అయినా కాకున్నా మంచి అనుభవాన్ని మాత్రం ఇస్తుంది. నిర్మాతగా ఆడియన్స్‌కు మంచి సినిమాలు అందించాలి. అందులోనే నాకు ఆనందం ఉంది. అందుకే ఎన్ని సమస్యలు ఎదురైనా ‘మైదాన్‌’ నిర్మించాను’ అని తెలిపారు.

Also Read : Prabhas: బాలీవుడ్ బ్యూటీతో ప్రభాస్ ఫోటో వైరల్ !

ajay devaganBoni KapoorPriyamani
Comments (0)
Add Comment