Hero Priyadarshi -Court Movie :కోర్ట్ చిత్రం అభినంద‌నీయం

కేసు గెలిచింది..చేతులు దులుపుకుంది

Court : టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త క‌థ‌లు రాజ్యం ఏలుతున్నాయి. ఇక కోర్టులు, వాదోప‌వాదాలు , కేసులు, శిక్షలు, ఇలాంటి సీన్స్ ప్ర‌తి సినిమాలో ఉండ‌నే ఉంటాయి. అస‌లు కోర్ట్ అనేది ఎందుకు ఉండాలి. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి. చ‌ట్టాలు ఎందుకు రూపొందిస్తారు. ఒక శిక్ష ఎలా మ‌నుషుల‌ను భ‌య‌ప‌డేలా చేస్తుంది..ఇలా స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కోసం ఎదురు చూస్తాం. తెలిసిన వాళ్ల‌ను అడిగే ప్ర‌య‌త్నం చేస్తాం. కానీ అదే కోర్టు గురించి కూలంకుశంగా తెలుసు కోవాల‌ని అనుకుంటే మాత్రం కోర్టు(Court) చిత్రం చూసి తీరాల్సిందే.

Court Movie Updates

స‌హ‌జ న‌ట‌న‌కు ప్ర‌తిరూపం ప్రియ‌ద‌ర్శి. త‌ను కొన్ని సినిమాల‌లో న‌టించాడు. బ‌ల‌గం మూవీ త‌న‌లో గొప్ప న‌టుడు ఉన్నాడ‌ని నిరూపించింది. ఇది దేశ వ్యాప్తంగా చ‌ర్చించుకునేలా చేసింది. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్ గా గుర్తింపు పొందిన వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చివ‌ర‌కు త‌న ఇంటి పేరు బ‌ల‌గం వేణుగా మారి పోయేలా చేసుకున్నాడు. ఈ త‌రుణంలో కొత్త కాన్సెప్ట్ తో వ‌చ్చిన చిత్ర‌మే ఈ కోర్టు. ఇందులో కీల‌క పాత్ర ను పోషించాడు ప్రియ‌ద‌ర్శి. త‌న పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశాడు. కోర్టు సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా చేస్తాయి. ఇందులో ద‌ర్శ‌కుడి పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

కోర్టు మూవీని నిర్మించింది ప్ర‌ముఖ న‌టుడు నాని. ఈ సినిమా న‌చ్చ‌క పోతే తాను న‌టి్స్తున్న హిట్ 3 చూడొద్దంటూ కూడా కామెంట్స్ చేసి మ‌రింత హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఇక ప్రియ‌ద‌ర్శి మాట్లాడిన మాట‌లు కూడా సినిమాకు అద‌న‌పు అస్సెట్ గా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సినిమా ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పోక్సో చ‌ట్టం చుట్టూ క‌థ తిరుగుతుంది. చివ‌ర‌కు ఏమ‌వుతుంద‌నే విష‌యం తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తంగా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంది. అంత‌కు మించి ఆలోచింప చేసేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Brahma Anandam Sensational :ఆహాలో బ్ర‌హ్మ ఆనందం స్ట్రీమింగ్

CinemaCourtPriyadarshi PulikondaTrendingUpdates
Comments (0)
Add Comment