Court : భిన్నమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన నటుడు ప్రియదర్శి(Priyadarshi). తను నటించే ప్రతి సినిమాలో ఓ సామాజిక సందేశం ఉండాలని కోరుకుంటాడు. అందుకు తగినట్టుగానే పాత్రలను ఎంచుకుంటాడు. ఇటు మూవీస్ తో పాటు ఓటీటీలో వచ్చే వెబ్ సీరీస్ లో కూడా నటిస్తూ బిజీగా మారి పోయాడు.
Priyadarshi Court Movie Updates
కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారిన వేణు దర్శకత్వంలో వచ్చి బలగం చిత్రం సంచలనం కలిగించింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఊహించని విధంగా అవార్డులతో పాటు పురస్కారాలు దక్కాయి. సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతకు ముందు ప్రియదర్శి జాతి రత్నాలులో నటించాడు.
సీరియస్ నెస్ , కామెడీని సమ పాళ్లల్లో పండించే నైపుణ్యం ప్రియదర్శి సొంతం. తాజాగా తను కీలక పాత్ర పోషించిన కోర్టు చిత్రం మార్చి 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్బంగా కోర్టు టీజర్ విడుదల చేశారు. మార్చి 7న ఇదే మూవీ ట్రైలర్ కూడా విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమాను ప్రముఖ సినీ నటుడు నాని సమర్పిస్తుండడం విశేషం.
ఈ చిత్రం ప్రత్యేకంగా పోక్సో చట్టాన్ని పరిశీలిస్తుంది. సామాజిక సంబంధిత సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. కోర్టు చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషిక, మరియు వడ్లమాని శ్రీనివాస్ కూడా కీలక పాత్రల్లో నటించారు. కోర్టు చిత్రానికి నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా ప్రశాంతి , దీప్తి గంటా నిర్మిస్తున్నారు.
Also Read : Popular MM Keeravani Concert :22న ఎంఎం కీరవాణి సంగీత కచేరి