Court : నేచురల్ స్టార్ నాని హాట్ టాపిక్ గా మారారు. ఓ వైపు డిఫరెంట్ సినిమాలు చేస్తూనే మరో వైపు తన ప్రొడక్షన్ లో మంచి సినిమాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తాజాగా తన జోనర్ లోంచి వస్తున్న చిత్రం కోర్ట్(Court). అసలు నిజంగా కోర్టులో ఏం ఉంటుంది. ఏం జరుగుతుంది. చట్టాలు ఏం చెబుతాయి. ఎలా వాదనలు చోటు చేసుకుంటాయి. లాయర్లు, న్యాయవాదులు, జడ్జీల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే దానిపై భిన్నంగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు ఈ కోర్ట్ చిత్రం ద్వారా.
Court Movie Upates
ఇదిలా ఉండగా నాని నటించిన హిట్ 3 మూవీ టీజర్ సూపర్ టాక్ తెచ్చుకుంది. ఇదే సమయంలో ప్యారడైజ్ కూడా వచ్చేసింది. ఇది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో కోర్ట్ కూడా వచ్చేసింది. ఇది కూడా అంచనాలకు మించి ఆదరణ చూరగొంటోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తనకు వచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకునే పనిలో పడ్డాడు.
ఇక కోర్ట్ చిత్రంలో ప్రియదర్శి(Priyadarshi), శివాజీ, హర్ష్ రోషన్ ,శ్రీదేవి, రోషిణి, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్బంగా జరిగిన ఈవెంట్ లో నటుడు శివాజీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు చాన్నాళ్ల తర్వాత ఛాన్స్ దక్కిందని, ఈ క్రెడిట్ అంతా నటుడు నానికే దక్కుతుందన్నాడు. ఒక రకంగా భావోద్వేగానికి లోనయ్యాడు తను.
ప్రధానంగా పోక్సో చట్టం గురించే కోర్ట్ మూవీలో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ఈ చట్టం బలమైనదే కానీ దీని వల్ల ఎంతో మంది అమాయకులు బలవుతున్నారని ఓ పాయింట్. మొత్తంగా ప్రియదర్శి చేసిన నటన, అంతకు మించి శివాజీకి కీలక పాత్ర దక్కడం ఒకింత అంచనాలు పెంచేలా చేసింది ఈ మూవీపై. కాగా ఈ చిత్రం రిలీజ్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు మూవీ మేకర్స్. మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Popular Movie Chhaava :తెలుగులోనూ దూసుకు పోతున్న ఛావా