Priyadarshi : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సహజసిద్దమైన నటుడిగా గుర్తింపు పొందాడు ప్రియదర్శి. తెలంగాణ మాండలికంతో ముందుగా పరిచయం అయినా తర్వాత తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. ఇటు సినిమాలతో అటు వెబ్ సీరీస్ లతో ఫుల్ బిజీగా మారి పోయాడు. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసందుకు ప్రయత్నం చేస్తాడు ప్రియదర్శి.
Priyadarshi ‘Premante’ Movie..
తాజాగా పూర్తిగా భిన్నమైన ప్రేమకథతో ముందుకు వస్తున్నాడు. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా ప్రేమంటే సినిమా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇందులో జగమెరిగిన యాంకర్ సుమ కీలకమైన పాత్ర పోషిస్తుండడం విశేషం.
సినిమా అనేది వినోదంతో పాటు అందమైన జీవితాన్ని ఆవిష్కరించేలా ఉండాలని , అందుకే ఫీల్ గుడ్ ఉండేలా ప్రేమంటే సినిమాను తీస్తున్నామని తెలిపాడు దర్శకుడు . ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై జాన్వీ నారంగ్ , పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ పై అందమైన క్యాప్షన్ చేర్చారు డైరెక్టర్. థ్రిల్లు ప్రాప్తిరస్తు అంటూ పేర్కొన్నారు.
Also Read : Hero Kiran Abbavaram Movie : ‘దిల్ రుబా’ వాలంటైన్స్ డే గిఫ్ట్