The Goat Life OTT : ఓటీటీలోకి రానున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’

అయితే థియేటర్లలో సినిమా విడుదలై సుమారు నాలుగు నెలలు గడుస్తున్నాఇంతవరకు ఓటీటీలోకి రాలేదు...

The Goat Life : మలయాళ సూపర్ స్టార్, సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithiviraj Sumkumaran) నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం (ది గోట్ లైఫ్(The Goat Life)). ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన ఒక కూలీ పడే కష్టాల ఇతి వృత్తంతో దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ ఏడాది మార్చి 28న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఆడు జీవితం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లను కలెక్ట్ చేసింది. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఆడు జీవితం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే థియేటర్లలో సినిమా విడుదలై సుమారు నాలుగు నెలలు గడుస్తున్నాఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆడు జీవితం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 19 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమసోషల్ మీడియా ఖాతాల వేదికగా ఆడు జీవితం సినిమా పోస్టర ను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్.

The Goat Life OTT Updates

కాగా థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగు నెలల తర్వాత ఆడు జీవితం సినిమా ఓటీటీలోకి రానుంది. దీంతో సినిమా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన అమలా పాల్ కథానాయికగా నటించింది. అలాగే హాలీవుడ్ నటులు జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేషం.మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఒక 5 రోజులు వెయిట్ చేయండి.. ఎంచెక్కా ఇంట్లోని కూర్చొని సినిమాను ఎంజాయ్ చేయండి.

Also Read : Indian 2 Movie : సినీప్రియులకు ఓ సరికొత్త అప్డేట్ ఇచ్చిన మేకర్స్

OTTThe Goat LifeTrendingUpdatesViral
Comments (0)
Add Comment