Prithviraj Sukumaran: కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత ఇండియన్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. ఇండియాలో నిర్మించే పలు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో హాలీవుడ్ లో కూడా ఇండియన్ సినిమాల పాత్ర కనిపిస్తోంది. అయితే భారతీయ భాషల్లో తీసిన సినిమాను ఇంగ్లీషులో కూడా విడుదల చేసిన సందర్భం ఇంతవరకు లేదు. అయితే ఈ పాన్ ఇండియా ఫార్ములాను బ్రేక్ చేసి పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమయ్యారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో భారతీయ భాషల్లో తెరకెక్కిస్తున్న ‘ఆడు జీవితం’ సినిమాను ఇంగ్లీషులో ‘ది గోట్ లైఫ్’ పేరుతో విడుదల చేస్తున్నారు.
Prithviraj Sukumaran – ఆశక్తిని రేకెత్తిస్తున్న ‘ఆడు జీవితం’ ట్రైలర్
భారతీయ భాషల్లో ‘ఆడు జీవితం’, ఇంగ్లీషులో ‘ది గోట్ లైఫ్’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మూడు నిమిషాల ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఎడారిలోకి తీసుకువెళ్లింది. పొట్టకూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మొహమ్మద్ అనే మలయాళీ ఎన్ని కష్టాలు పడ్డాడు ?.. అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు ఎడారి బాట పట్టిన అతడు ఎలా బతికాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్ లో పృథ్వీరాజ్(Prithviraj Sukumaran) తన నటనతో కట్టిపడేశారు. ఎడారిలో ఆహారం దొరక్క బక్క చిక్కిపోయిన వ్యక్తిగా తనను తాను మార్చుకున్న తీరూ అలరిస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వస్తున్న ‘ఆడు జీవితం’
జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో భారతీయ భాషల్లో తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆడు జీవితం’. థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమాలో అమలాపాల్ కథానాయకగా నటించగా ఆస్కార్ అవార్డు గ్రహీతలు A.R.రెహమాన్ సంగీతం అందించగా, సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి, భారతదేశంలో అత్యధిక అవార్డులు పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సునీల్ కె ఎస్ చేస్తుండగా.. కథను బెన్యామిన్ అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10 ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Also Read : Jigarthanda DoubleX: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’