Prithviraj Sukumaran: మహేశ్ బాబు సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ?

మహేశ్ బాబు సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ?

Prithviraj Sukumaran: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో త్వరలో సినిమా ప్రారంభం కాబోతుంది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం అయిన ఈ సినిమాను సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పిన మాటల ప్రకారం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వంచరెస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈ సినిమాలో యాక్షన్ స్వీక్వెన్స్, ఫిట్ నెస్ మరియు కొత్త లుక్ కోసం మహేశ్ బాబు ఇప్పటికే జర్మనీ వెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు దర్శకుడు రాజమౌళి. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ పుకారు బయటకు వచ్చింది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Prithviraj Sukumaran Movie..

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ఈ సినిమా విలన్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ ఒకటి బయటకు వచ్చింది. మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయక పాత్ర కోసం మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) ఎంపిక దాదాపు ఖాయమైనట్టు సమాచారం. ఈ విషయానన్ని జక్కన్న గోప్యంగా ఉంచినప్పటకీ..లీకుల వీరులు బయటకు వదిలేశారు. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్విరాజ్‌ సుకుమారన్.. ‘సలార్‌’తో పాన్‌ ఇండియా నటుడయ్యాడు. ఆ చిత్రంలో పృథ్విరాజ్‌ ప్రభాస్‌తో పోటీ పడి నటించాడు. తన సినిమాలోని విలన్‌ పాత్రకు పృథ్వీరాజ్‌ బాగా సెట్‌ అవుతాడని జక్కన్న భావిస్తున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? పృథ్విరాజ్‌ వెంటనే ఓకే చెప్పేశాడట. అన్ని సెట్‌ అయితే… మహేశ్‌ బాబును ఢీకొట్టే విలన్‌గా పృథ్విరాజ్‌ను చూడొచ్చు.

Also Read : Girls Will Be Girls: బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’ !

Prithviraj SukumaranSS RajamouliSSMB29Super Star Mahesh Babu
Comments (0)
Add Comment