Hero Prithviraj Sukumaran :సుకుమారన్ కామెంట్స్ సెన్సేష‌న్

త్వ‌ర‌లో జ‌క్క‌న్న‌..ప్రిన్స్ మూవీలో ఎంట్రీ

Prithviraj Sukumaran: విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరు మ‌ల‌యాళ సినీ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్. త‌న‌కు ఎలాంటి పాత్ర ఇచ్చినా స‌రే దానికి వంద శాతం కంటే ఎక్కువ న్యాయం చేస్తాడ‌న్న పేరుంది. దీంతో త‌న‌కు ద‌ర్శ‌కుల‌కు ఇష్ట‌మైన న‌టుడిగా మారి పోయాడు. వ్య‌క్తిత్వ ప‌రంగా చాలా సాఫ్ట్ గా క‌నిపిస్తాడు కానీ తెర ముందుకు వ‌చ్చేస‌రికి మ‌రింత రౌద్రాన్ని ప‌లికిస్తాడు. అందుకే త‌న‌ను ఏరికోరి ఎంచుకుంటారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. త‌న గురించి ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ వార్త‌.

Prithviraj Sukumaran Sensational Comments

ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో భారీ నిర్మాణంతో తెర‌కెక్కుతోంది ఎస్ఎస్ఎంబీ29 చిత్రం. ప్ర‌స్తుతం మూవీ షూటింగ్ ఒడిశా అడ‌వులు, ప్రాంతాల‌లో కొన‌సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా న‌టిస్తోంది. ఇప్ప‌టికే క‌న్ ఫ‌ర్మ్ కూడా చేశారు మూవీ మేక‌ర్స్. బాహుబ‌ళి, ఆర్ఆర్ఆర్ చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న చిత్రం ఈ సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ త‌రుణంలో జ‌క్క‌న్న మూవీలో ఎవ‌రు ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తార‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశాడు మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్(Prithviraj Sukumaran). దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కేఎల్ నారాయ‌ణ నిర్మిస్తున్న చిత్రంలో తాను కూడా భాగం కాబోతున్నాన‌ని చూచాయిగా వెల్ల‌డించాడు. త‌న పాత్ర ఏమిట‌నేది ఇంకా తెలియ‌దు. కానీ జ‌క్క‌న్న‌తో క‌లిసి ప‌ని చేసే అదృష్టం త‌న‌కు దక్కిందంటూ పేర్కొన్నాడు.

Also Read : Pooja Hegde Shocking :లింగ వివ‌క్ష నిజం పూజా హెగ్డే భావోద్వేగం

CommentsPrithviraj SukumaranViral
Comments (0)
Add Comment