Manipur : ఢిల్లీ – గత రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది మోడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
India Govt Shocking Decision on Manipur
ఇదిలా ఉండగా కొంత కాలం నుంచి మణిపూర్(Manipur) అట్టుడుకుతోంది. జాతుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ సైతం నిలదీశారు. ఒక వర్గాన్ని కావాలని నామ రూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారంటూ వాపోయారు.
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాకాండ, మానత్వం మరిచి పోయి ఆస్తులను తగులబెట్టడం, చివరకు మహిళలను వివస్త్రలను చేయడం కూడా సభ్య సమాజం తల దించుకునేలా చేసింది.
ఈ తరుణంలో శాసన సభకు ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ మరోసారి మణిపూర్ లో అధికారంలోకి వచ్చింది. అయినా మార్పు రాలేదు. సీఎంగా బీరేన్ సింగ్ కొలువు తీరినా సేమ్ సీన్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. హింస మరింత చెలరేగింది. అల్లర్లు, ఆందోళనలు, పోరాటాలు, నిరసనలు నిత్యకృత్యంగా మారాయి.
దీంతో శాంతి భద్రతల పరిస్థితి తలనొప్పిగా మారాయి. నిత్యం బూట్ల చప్పుళ్ల మధ్య మణిపూర్ వాసులు బిక్కుబిక్కుమంటూ బతికారు. అమిత్ షా చేసిన ప్రయత్నం ఫలించ లేదు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీరేన్ సింగ్. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు గవర్నర్.
పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదని గ్రహించిన కేంద్రం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్టకేలకు ఆమోదం తెలిపారు.
Also Read : Rajit Patidar Got Big Chance :రజిత్ పాటిదార్ ఆర్సీబీ స్కిప్పర్